అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs BAN | ఆసియా కప్ 2025లో Asia Cup టీమిండియా జైత్రయాత్ర ఆగడం లేదు. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన సూర్య సేన ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
బుధవారం జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ Bangladesh పై 41 పరుగుల తేడాతో గెలిచిన భారత్, టోర్నీలో ఓటమి చూడని ఏకైక జట్టుగా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
హార్దిక్ పాండ్యా (38), శుభ్‌మన్ గిల్ (29) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ (2/27) ఉత్తమంగా రాణించాడు.
IND vs BAN | ఫైనల్లో భారత్..
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ Bangladesh 127 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సైఫ్ హసన్ (69; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరిగా పోరాడినా జట్టును నిలబెట్టలేకపోయాడు.
మిగతా బ్యాటర్లు విఫలమవడంతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/18), జస్‌ప్రీత్ బుమ్రా (2/18), వరుణ్ చక్రవర్తి (2/29) కీలక వికెట్లు తీశారు.
అయితే ఈ విజయంతో మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండానే భారత్ ఫైనల్ చేరింది. మరోవైపు శ్రీలంక Srilanka ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, బంగ్లాదేశ్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
గురువారం జరగబోయే పాకిస్థాన్–బంగ్లాదేశ్ మ్యాచ్ ఫైనల్ బెర్త్ ఖరారు చేయనుంది. పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ ఆడుతుంది. బంగ్లా గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ Abisekh sharma చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2025 టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్న అభిషేక్ శర్మ.. సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డ్‌ను అభిషేక్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అభిషేక్ శర్మ 16 సిక్స్‌లు బాదాడు. అంతకముందు సనత్ జయసూర్య 14 సిక్స్‌ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
