అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని మొన్నటి వరకు చలి వణికించింది. రెండు రోజులుగా చలితీవ్రత కాస్త తగ్గింది. అయితే తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
సోమవారం నాటికి అది వాయుగుండంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం వరకు తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కడప, నెల్లూరు తదితర జిల్లాల్లో వర్షం కురుస్తోంది.
Weather Updates | సెన్యార్ తుపాన్‌గా..
అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారితే.. సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 27 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
