Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | బాలబాలికలు నియంత్రణలో ఉంటే.. ఉజ్వల భవిష్యత్తు

Nizamabad City | బాలబాలికలు నియంత్రణలో ఉంటే.. ఉజ్వల భవిష్యత్తు

బాలబాలికలు నియంత్రణ కోల్పోతే భవష్యత్తు ప్రమాదకరంలో పడుతుందని జిల్లా జడ్జి హరీషా పేర్కొన్నారు. నగరంలోని శంకర్​భవన్​లో న్యాయసేవా సహకారం సంస్థ ఆధ్వర్యంలో న్యాయసేవా సదస్సును నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | బాలబాలికలు నియంత్రణ కోల్పోతే భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుందని జిల్లా జడ్జి హరీషా (District Judge Harisha) పేర్కొన్నారు. నగరంలోని శంకర్​భవన్​లో న్యాయసేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో న్యాయసేవా సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ.. బాలికలకు గుడ్​ టచ్​ బ్యాడ్​ టచ్​ (good touch bad touch) గురించి వివరించారు. టీనేజీ వయసులో విద్యార్థుల్లో కలిగే మార్పులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారితో ఎలా కఠినంగా ఉండాలో తెలియజేశారు.

Nizamabad City | స్నేహం విషయంలో నియంత్రణ ఉండాలి..

బాలురు కానీ, బాలికలు (boys or girls) కానీ స్నేహం చేసినా కూడా నియంత్రణలో ఉండాలని న్యాయమూర్తి సూచించారు. లేకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాటల విని బాలబాలికలు చక్కగా చదువుకోవాలన్నారు.

టీనేజీ వయసులో కలిగే మార్పులకు ప్రభావితం కాకూడదని, అనుచిత ప్రవర్తన, అప్రమత్తంగా ఉండాలన్నారు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఏవైనా సమస్యలు వస్తే 100, 1098 నంబర్ల​కు ఫోన్​ చేయాలని సూచించారు.

అడిషనల్ జడ్జి న్యాయ సేవా సహకార సంస్థ కార్యదర్శి సాయిసుధ మాట్లాడుతూ అమ్మాయిలకు సమస్యలు వస్తే తల్లికి చెప్పాలన్నారు. అమ్మాయిలను బ్లాక్​మెయిల్​ కాని.. అసభ్యంగా గాని ప్రవర్తిస్తే న్యాయ సేవా సహకార సంస్థను ఎల్లవేళలా సంప్రదించవచ్చన్నారు. అమ్మాయిలు అడిగిన సందేహాలకు జిల్లా అడిషనల్ జడ్జ్ హరీషా సమాధానాలు ఇచ్చారు.

Nizamabad City | సహకార సంస్థ సభ్యులు

రాజ్​కుమార్​ సుబేదార్, రవీందర్, పట్టణ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాసరాజు, టూ టౌన్ ఎస్సై హన్మాండ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, టీపీటీఎఫ్​ అధ్యక్షుడు వెనిగల్ల సురేష్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు శ్రీహరి రావు రాజయ్య, మాధవి, రజిని, రాజేంద్రప్రసాద్, విద్యార్థులు న్యాయ సేవా సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.