అక్షరటుడే, బాన్సువాడ : Banswada | మండలంలోని ఇబ్రహీంపేట్ (Ibrahimpet) మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఉద్దర చిన్న హన్మాండ్లు అప్పా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఎప్పటికప్పుడు గ్రామస్థుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే చతురత కలిగిన నాయకుడిగా ఆయన పేరు పొందారు.
సామాన్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మంచి మనిషిగా గుర్తింపు ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీగా గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని పలువురు కొనియాడారు. హన్మాండ్లు ఆకస్మిక మృతి పట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
