అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Transfers Telangana | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీ అయ్యారు. మొత్తం 45 మందిని ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ కుమార్‌ను పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. సబ్యసాచి ఘోష్‌కు ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు CSR బాధ్యతలు అప్పగించారు. లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీ శాఖ IAS స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా కొనసాగుతున్నదాన కిషోర్‌కు విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా శ్రీధర్, రాహుల్ బొజ్జ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు. ఆయనకు బీసీ వెల్ఫేర్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇరిగేషన్, సీఏడీ కార్యదర్శిగా ఈ శ్రీధర్, ఫైనాన్స్ ప్లానింగ్ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, మహబూబ్ కలెక్టర్‌గా ఉన్న బీ విజేంద్ర తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. డి దివ్యకు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ మూడో డిస్కమ్ సీఎండీగా, భవేశ్ మిశ్రా ఐటీ శాఖలో స్పెషల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
IAS Transfers Telangana | పలువురు కలెక్టర్లు సైతం
మహబూబాబాద్ కలెక్టర్ (Mahabubabad Collector) అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం హనుమంత రావు ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రెటరీగా, జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ జా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా ట్రాన్స్ఫర్ అయ్యారు. కరీంనగర్ కలెక్టర్ పమీల సత్పత్తి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్ (Yadadri Bhuvanagiri Collector)గా నియామకం అయ్యారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రార్‌గా, జనగాం కలెక్టర్ రిజ్వానాబాషా షేక్ గద్వాలకు బదిలీ అయ్యారు.
జితేష్ వి పాటిల్ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా, సంతోష్ బీఎం జోగులాంబ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేటకు, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్‌కు బదిలీ అయ్యారు. కాత్యాయని దేవి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఫణీంద్ర రెడ్డి, నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా, చిత్ర మిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం అయ్యారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ (Rajanna Siricilla Collector) గరిమా అగర్వాల్, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారి, మెదక్‌కు ప్రతీమా సింగ్, కొత్తగూడెం అంకిత్, హన్మకొండ చహత్ బాజ్‌పేయి, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా ట్రాన్స్ఫర్ అయ్యారు. రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్‌గా మంద మకరందు, హైదరాబాద్ మెట్రో జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా లలిత్‌కుమార్ నియామకం అయ్యారు.
IAS Transfers Telangana | అదనపు కలెక్టర్లుగా..
మేడ్చల్ అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, వికారాబాద్ ఉమా శంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రాష్ట్ర సర్వీస్ అధికారులకు సైతం ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, మంచిర్యాల పి. చంద్రయ్య, వరంగల్ వైవీ గణేశ్, సిద్దిపేట అబ్దుల్ హమీద్, నిర్మల్ బి వెంకటేశ్వర్లు, వనపర్తి అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్‌కు పోస్టింగ్ ఇచ్చింది. ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా కె విద్యాసాగర్, ప్రజావాణి అదనపు నోడలల్ అధికారిగా ఎం సురేందర్ నియమితులయ్యారు.
