IAS Officers | టీవీ కథనంపై ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: IAS Officers | ఓ టీవీ ఛానెల్​లో ప్రసారం అయిన కథనంపై ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్​ అధికారి (Woman IAS Officer)పై చేసిన ఆరోపణలను ఆయా సంఘాలు ఖండించాయి. రాష్ట్రంలోని ఓ మంత్రితో మహిళా ఐఏఎస్​ అధికారి ప్రేమ వ్యవహారం నడిపించారని ఇటీవల ఓ ఛానెల్​లో ప్రత్యేక కథనం ప్రచురించారు. దీంతో సదరు మంత్రి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆ అధికారిని బదిలీ చేశారని కథనంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: IAS Officers | ఓ టీవీ ఛానెల్​లో ప్రసారం అయిన కథనంపై ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్​ అధికారి (Woman IAS Officer)పై చేసిన ఆరోపణలను ఆయా సంఘాలు ఖండించాయి.

రాష్ట్రంలోని ఓ మంత్రితో మహిళా ఐఏఎస్​ అధికారి ప్రేమ వ్యవహారం నడిపించారని ఇటీవల ఓ ఛానెల్​లో ప్రత్యేక కథనం ప్రచురించారు. దీంతో సదరు మంత్రి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆ అధికారిని బదిలీ చేశారని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ కథనంపై ఐఏఎస్​ అధికారుల సంఘం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధర ఆరోపణలు చేసిన సదరు టీవీ ఛానెల్​ (TV Channel) క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది.

IAS Officers | కించపరిచే ప్రయత్నం

ఈ కార్యక్రమంలో మహిళా IAS అధికారులపై తప్పుడు, దురుద్దేశపూరితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని అసోసియేషన్​ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా కల్పితమైనవి, పరువు నష్టం కలిగించేవని పేర్కొంది. జర్నలిజం (Journalism) ప్రాథమిక నిబంధనలకు కట్టుబడి ఉండకుండా నిర్లక్ష్యంగా ప్రసారం చేయడం సరికాదని తెలిపింది. ఈ కంటెంట్ ముఖ్యంగా మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కథనాలు పాలనపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. సదరు కంటెంట్​ను తొలగించి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని అసోసియేషన్​ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

IAS Officers | ఐపీఎస్​ అసోసియేషన్​ సంఘీభావం

తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం (Telangana IPS Officers Association) ఐఏఎస్ అధికారుల సంఘానికి సంఘీభావం తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కొన్ని మీడియా వేదికలు ప్రసారం చేసిన బాధ్యతారహితమైన, దురుద్దేశపూరితమైన, పరువు నష్టం కలిగించే ప్రసారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ సంఘటనను జర్నలిజం ముసుగులో వ్యక్తిత్వ హనానికి పాల్పడటంగా పేర్కొంది. సంబంధిత మీడియా సంస్థలు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది.

Related articles

Feb 26 Gold Prices | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి ధ‌ర‌ ఎంతంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో...

Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో...

Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope...

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...