Homeజిల్లాలునిజామాబాద్​PCC President | పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు : మహేశ్​గౌడ్​

PCC President | పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు : మహేశ్​గౌడ్​

తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలంలోని తన స్వగ్రామమైన రహత్‌నగర్​లో ఆదివారం పర్యటించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC President | తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ (Bomma Mahesh Kumar Goud) తెలిపారు. నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలంలోని (Bheemgal Mandal) తన స్వగ్రామమైన రహత్‌నగర్​లో ఆదివారం పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయ భూమిపూజలో మహేశ్​గౌడ్​ పాల్గొన్నారు. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డితో (MLA Vemula Prashanth Reddy) కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

మహేశ్​గౌడ్​ మాట్లాడుతూ. బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను అన్నారు. తల్లిదండ్రులు చేసిన సేవలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. గ్రామంతో తన అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామం మీదుగా వెళ్లే టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం సీఎం, సంబంధిత మంత్రితో మాట్లాడి రూ.380 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.