అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరి గూడలో 800 గజాల అసైన్డ్ ల్యాండ్ కబ్జా అయింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Former BRS MLA Rega Kanta Rao) ఈ భూమిని తమకు అమ్మినట్లు బాధితులు చెప్పారు. అయితే అవి అక్రమ నిర్మాణాలని హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కబ్జాదారులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Hydraa | హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ
నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములతో పాటు పార్క్ స్థలాలను రక్షిస్తోంది. దీంతో ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు పెరిగాయి. సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం (Gajularamaram)లో వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ ఉంది. 200 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నీరు దిగువన ఉన్న చెరువులోకి వెళ్లేది. అయితే ఓ సంస్థ చెరువు నీరు వెళ్లే దారిలో అపార్టుమెంట్లు కట్టింది. దీంతో వరద నీరు కాలనీలోకి వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
హయత్‌నగర్ మండలం (Hayatnagar Mandal) కాప్రాయి చెరువు అలుగులు మూసేయడంతో చెరువు నిండి ఎగువున ఉన్న తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని హరిహరపురం కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పశుమాముల గ్రామ సర్వే నంబరు 454లో 9 ఎకరాల పరిధిలో దాదాపు 155 ప్లాట్లతో 1982లో లే ఔట్ వేశారు. దీనికి ఆనుకుని ఉన్న 455 సర్వే నంబరులో 1.06 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి తమ లే ఔట్‌లోకి వచ్చి రహదారులు కబ్జా చేసి కొన్నిప్లాట్లను కూడా కలిపేసుకున్నారని బాధితులు హైడ్రాను ఆశ్రయించారు.
