అక్షరటుడే, హైదరాబాద్: Heavy rains alert | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ Greater Hyderabad లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు మరో రెండు గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
Heavy rains alert | 24 గంటల్లో భారీ వర్షాలు..
రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ Meteorological Department హెచ్చరించింది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ములుగు mulugu, కామారెడ్డి, మెదక్ Medak, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, ఖమ్మం Khammam, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక నిన్న రాష్ట్రంలో అత్యధికంగా ఏటూరి నాగారంలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది.