ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Heavy Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసుల ఇబ్బందులు

    Heavy Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసుల ఇబ్బందులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    మహా నగరంలో రెండు, మూడు రోజులుగా నిత్యం సాయంత్రం కాగానే వాన దంచి కొడుతోంది. ప్రజలు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతుండడంతో ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, తార్నాక, ఉప్పల్, చాదర్‌ఘాట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, నల్లకుంట, హిమాయత్‌నగర్, మాదాపూర్, టోలీచౌకి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.

    Heavy Rains | హెచ్చరించిన ఐఎండీ

    హైదరాబాద్​లో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు కూడా ఉదయం ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాలు పడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్​ క్లియర్​ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...