Homeజిల్లాలుహైదరాబాద్Heavy Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. ప్రజలు బయటకు రావొద్దని సూచన

Heavy Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. ప్రజలు బయటకు రావొద్దని సూచన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వాన దంచి కొడుతోంది. నగర వ్యాప్తంగా రాత్రి ఏడు గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. రాత్రి 11 గంటల వరకు వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వర్షానికి రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన నగరవాసులు గంటల కొద్ది ట్రాఫిక్​లో చిక్కుకున్నారు.

ఈ క్రమంలో నగర మేయర్​ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె కోరారు. వర్షం నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర సాయం కోసం నగర ప్రజలు 040– 21111111 నంబర్​కు ఫోన్​ చేయాలని ఆమె కోరారు.