అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat elections | స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై సోమవారం విచారణ జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలపనుంది. కోర్టు విచారణ అనంతరం ఎన్నికల షెడ్యూల్ (election schedule) విడుదల చేయాలని భావించింది. అయితే నేడు విచారణ జరగకపోవడంతో మరో రోజు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Panchayat elections | రిజర్వేషన్లు ఖరారు
రాష్ట్రంలో మొదట పంచాతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓటరు జాబితాను ప్రదర్శించిన అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. సర్పంచ్, వార్డు స్థానాలను ఆయా వర్గాలకు కేటాయించారు. సుప్రీం తీర్పు (Supreme Court verdict) మేరకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మొత్తం ఎస్టీలు ఉన్న గ్రామాల్లో వార్డులు, సర్పంచ్ స్థానాలను ఆ వర్గం వారికే ఇచ్చారు. అలాగే మిగతా గ్రామాల్లో సైతం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అయ్యారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయించారు.
Panchayat elections | మూడు దశల్లో ఎన్నికలు
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదన చేసింది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని నాయకులు తెలిపారు.
