అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLA Raja Singh | గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) లక్ష్యంగా విమర్శలు చేశారు.
రాజాసింగ్ కొంతకాలంగా బీజేపీలోని (BJP) పలువురు నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి సైతం రాజీనామా చేశారు. గతంలో పరోక్షంగా విమర్శలు చేసిన ఆయన తాజాగా కిషన్‌రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేశారు. ఆయన వల్లే పార్టీ సర్వ నాశనమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కొందరు తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీలో తప్పులు జరుగుతున్నాయని, అందుకే తాను రాజీనామా చేశానని చెప్పారు.
MLA Raja Singh | రాజకీయ సన్యాసం తీసుకుంటా..
బీజేపీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే, తాను చేస్తానన్నారు. “ఇద్దరం స్వతంత్రంగా పోటీ చేస్తే ఎవరి దమ్ము ఎంటో’’ తెలుస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకర్గంలోని (Secunderabad parliamentary constituency) వారే ఉన్నారని విమర్శించారు. కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వేశారా.. కిషన్‌రెడ్డి వేశారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. రాంచందర్‌రావు (Ramchandra Rao) మంచి వ్యక్తేనని.. కానీ ఆయన రబ్బర్ స్టాంప్‌గా మారారని అన్నారు.
MLA Raja Singh | వారు సంతృప్తిగా లేరు
బీజేపీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో (BJP MPs and MLAs) తనకు మంచి సంబంధాలు ఉన్నాయని రాజాసింగ్ తెలిపారు. రాష్ట్ర కమిటీపై వారు సంతృప్తిగా లేరన్నారు. పార్టీని నాశనం చేసేందుకు ఈ కమిటీ వేశారని కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.