అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harbhajan Singh | అబూదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్, పాకిస్థాన్ పేసర్ షాహనవాజ్ దహానీతో (Shahnawaz Dahani) కరచాలనం చేసిన ఘటన ఇప్పుడు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బుధవారం ఆస్పిన్ స్టాలియన్స్–నార్తర్న్ వారియర్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత స్టాలియన్స్ కెప్టెన్ హర్భజన్ (Harbhajan Singh), దహానీతో స్నేహపూర్వకంగా మాట్లాడి హ్యాండ్‌షేక్ చేయడం అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. పహల్గామ్ దాడి (Pahalgam Attack) తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయడం కూడా మానేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్, మహిళల ప్రపంచకప్ వంటి పలు టోర్నీల్లోనూ ఇదే దృశ్యం స్పష్టంగా కనిపించింది.
Harbhajan Singh | ఇప్పుడిదే హాట్ టాపిక్..
ఇక హర్భజన్ సింగ్ స్వయంగా కొన్ని నెలల క్రితం పాక్ జట్టుతో ఆడటానికి నిరాకరించిన సంఘటన ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌ను శిఖర్ ధావన్, పఠాన్ బ్రదర్స్, సురేశ్ రైనాలతో కలిసి బహిష్కరించిన విషయం తెలిసిందే. “రక్తం, చెమట కలిసి రావు” అన్న వ్యాఖ్యతో వారి నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ బహిష్కరణతో ఇండియా ఛాంపియన్స్ మ్యాచ్‌ను కోల్పోగా, పాకిస్థాన్ ఫైనల్‌కి చేరింది. అయితే అప్పట్లో అంత కఠినంగా ఉన్న హర్భజన్ సింగ్ ఇప్పుడు షేక్ హ్యాండ్ (Shake Hand) ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
ఇక నిన్న జరిగిన టీ10 లీగ్ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ (Northern Warriors) 4 పరుగుల తేడాతో స్టాలియన్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో దహానీ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచి కేవలం 10 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కెప్టెన్ హర్భజన్ ఒక ఓవర్ వేసి 8 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అయితే హర్భజన్–దహానీ కరచాలనం నేపథ్య రాజకీయ ఉద్రిక్తతలను పక్కనబెట్టి క్రీడా స్పూర్తిని ముందుకు తెచ్చిందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3
— Ather (@Atherr_official) November 19, 2025
