అక్షరటుడే, వెబ్‌డెస్క్: Green peas | చలికాలం winter | వచ్చిందంటే మార్కెట్ market లో పచ్చని బఠానీలు కనువిందు చేస్తాయి. రుచితో పాటు ఎన్నో పోషకాలు ఉన్న ఈ బఠానీలు కేవలం ఈ సీజన్‌లో మాత్రమే విరివిగా లభిస్తాయి. అందుకే చాలామంది వీటిని వేసవి కాలంలో కూడా వాడుకోవాలని కోరుకుంటారు. కానీ, సరిగ్గా నిల్వ చేయకపోతే ఇవి రెండు రోజుల్లోనే పాడైపోతాయి. అయితే, కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటిస్తే పచ్చి బఠానీలను 6 నెలల నుంచి ఏడాది పాటు తాజాగా ఉంచుకోవచ్చు.
Green peas | నిల్వ చేసే పద్ధతులు:
గాలి తగలకుండా డీ ఫ్రిజ్‌లో: ముందుగా పచ్చి బఠానీలను వొలుచుకుని గింజలను వేరు చేయాలి. వీటిని కడగకూడదు, కేవలం పొడి గుడ్డతో తుడిచి ఒక గంట సేపు గాలికి ఆరబెట్టాలి. తేమ పూర్తిగా పోయిన తర్వాత, వీటిని ఒక జిప్‌లాక్ కవర్లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేయాలి. కవర్లో గాలి లేకుండా చూసుకుని డీ ఫ్రిజ్‌లో పెడితే సుమారు ఆరు నెలల వరకు ఇవి తాజాగా ఉంటాయి.
బ్లాంచింగ్ పద్ధతి (Blanching Method): బఠానీలు ఏడాది పొడవునా రంగు, రుచి కోల్పోకుండా ఉండాలంటే ఈ పద్ధతి ఉత్తమమైనది. మొదట నీటిని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో బఠానీలను వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. వెంటనే వాటిని తీసి ఐస్ ముక్కలు ఉన్న చల్లని నీటిలో వేయాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, గింజలను బాగా ఆరబెట్టి ఫ్రీజర్ పౌచ్‌లలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే 12 నెలల వరకు వాడుకోవచ్చు.
ఉప్పుతో నిల్వ చేయడం: ఒకవేళ మీ ఇంట్లో ఫ్రీజర్ సౌకర్యం లేకపోతే, ఉప్పును ఉపయోగించి కూడా నిల్వ చేయవచ్చు. ఒక గాజు సీసా తీసుకుని అడుగున ఉప్పు వేయాలి. దానిపై బఠానీ గింజలు వేసి, మళ్లీ పైన ఉప్పు చల్లాలి. ఇలా పొరలు పొరలుగా వేయడం వల్ల ఉప్పు తేమను పీల్చుకుని గింజలు పాడవకుండా కాపాడుతుంది.
బఠానీ పేస్ట్: బఠానీలను ఉడకబెట్టి మిక్సీలో పేస్ట్‌లా రుబ్బాలి. అందులో కొద్దిగా ఉప్పు కలిపి గాలి దూరని కవర్లలో నింపి ఫ్రీజ్ చేయాలి. ఈ పేస్ట్‌ను పరాఠాలు, కట్లెట్స్ లేదా గ్రేవీ కూరల్లో వాడుకుంటే వంటకు అద్భుతమైన రుచి వస్తుంది.
బఠానీలను నిల్వ చేసేటప్పుడు గాలి దూరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. గాలి తగిలితే ఐస్ పేరుకుపోయి గింజల రుచి మారుతుంది.