అక్షరటుడే, ఆర్మూర్: Armoor | కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆర్మూరు నవనాథ సిద్దులగుట్టపై (Navnath Siddulagutta) రథోత్సవం, సప్తహారతి, గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) ముఖ్య అతిథిగా హాజరై స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల మంగళ హారతులు, డప్పు వాయిద్యాల నడుమ శివ నామస్మరణతో గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరుణాచలం (Arunachalam), యాదగిరిగుట్ట, సింహాచలం, అన్నవరం వంటి అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆచారం ఉందని కొన్నేళ్లుగా మన ఆర్మూర్లో కూడా ఈ విధంగా గిరిప్రదక్షిణ చేయడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట పలగుట్ట మహారాజు మంగి రాములు, నందీశ్వర మహారాజ్, సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు సుమన్, చరణ్ రెడ్డీ, జిమ్మీ రవి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సర్వ సమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
