అక్షరటుడే, ఇందూరు: Gram Panchayat elections | గ్రామపంచాయతీ, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లు ఉన్నాయి.
ఈ మూడు డివిజన్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 11వ తేదీన బోధన్, 14వ తేదీన నిజామాబాద్, 17వ తేదీన ఆర్మూర్ డివిజన్లో పోలింగ్ ఉంటుంది.
Gram Panchayat elections | డివిజన్ల వారీగా..
బోధన్ డివిజన్లోని మొత్తం 11 మండలాల్లో 184 గ్రామపంచాయతీ, 1642 వార్డు స్థానాలకు ఉన్నాయి. వీటి కోసం డివిజన్లో 1653 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు.
నిజామాబాద్ డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 196 గ్రామపంచాయతీలు, 1760 వార్డు స్థానాలు ఉండగా.. ఈ డివిజన్లో 1760 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఆర్మూర్ డివిజన్లో ఉన్న 12 మండలంలో 165 సర్పంచి, 1620 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటి కోసం 1640 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు.
