Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam | మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం

MLA Pocharam | మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందూర్​ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : MLA Pocharam | గ్రామీణ ప్రజలు, రైతులు, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల పరిధిలో మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో (Kasula Balaraj) కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు.

చందూర్ చెరువులో (Chandur Lake) ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. చేపల పెంపకదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. మేడిపల్లి గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను ప్రారంభించారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించిన సొసైటీ సబ్‌సెంటర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చందూర్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలను (Indiramma Sarees) పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమాల్లో చందూర్, మోస్రా, వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.