అక్షరటుడే, కోటగిరి : Pothangal | పోతంగల్ మండలంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ.. పోతంగల్ మండలం చెక్ పోస్ట్ నుంచి హున్సా వరకు రోడ్డు కోసం రూ. 30 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
ప్రస్తుతం సింగిల్ రోడ్డు ఉండడంతో దానిపై గుంతలు పడి ప్రయాణాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం కొత్త రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో తమ సమస్యలు తీరినట్టేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy)కి, కాసుల బాలరాజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, ఎజాజ్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు, గంధపు పవన్, హంగర్గా గంగాధర్, కేశ వీరేశం, మాణిక్, పులకంటి సాయిలు, వర్ని శంకర్,హన్మంత్ రావు, గంట్ల విఠల్, దిలీప్ కుమార్, శివరాజ్, గౌతం షేరు, గంధపు,రాజు, దత్తు, రవి ఇస్మాయిల్ పాల్గొన్నారు.
