HomeతెలంగాణScholarship | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. స్కాలర్​షిప్​ బకాయిలు విడుదల చేయాలని ఆదేశం

Scholarship | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. స్కాలర్​షిప్​ బకాయిలు విడుదల చేయాలని ఆదేశం

విద్యార్థులకు పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​ బకాయిల కోసం తక్షణమే రూ.161 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆయన ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scholarship | రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. పెండింగ్​ స్కాలర్​షిప్​ బకాయిల విడుదలకు ఓకే చెప్పింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కొంతకాలంగా స్కాలర్​షిప్​, రీయింబర్స్​మెంట్ (Reimbursement)​ బకాయిలు పేరుకుపోయాయి. రీయింబర్స్​మెంట్​ కోసం ఇటీవల ప్రైవేట్​ కాలేజీలు బంద్​ పాటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి కొన్ని నిధులు విడుదల చేసింది. తాజాగా స్కాలర్​షిప్​ బకాయిలు కూడా విడుదల చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.161 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థులు, సంస్థలు ఇబ్బందులు పడకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం సమీక్షించారు.

Scholarship | విద్యార్థులకు ఇబ్బందులు కల్గకుండా..

విద్యార్థులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. బీఆర్​ఎస్​ హయాంలో చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా, కళాశాలలకు అవసరమైన నిధులు చేరేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.