DA Hike | ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్: DA Hike | సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు (pensioners) రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తామని సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్​కుమార్​ సుల్తానీయా ఉత్తర్వులు జాఈర చేశారు. ప్రస్తుతం డీఏ 30.03 శాతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: DA Hike | సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు (pensioners) రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగులకు మరో డీఏ ఇస్తామని సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్​కుమార్​ సుల్తానీయా ఉత్తర్వులు జాఈర చేశారు. ప్రస్తుతం డీఏ 30.03 శాతం ఉండగా.. 33.67 శాతానికి పెంచింది. ఈ పెంపు 2023 జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. 2026 జనవరిలో జీతంలో పెంచిన డీఏను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు పెంచిన డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్​ ఖాతాలో (GPF account) వేస్తామని ప్రకటించింది. రిటైర్డ్​ అయ్యే వారికి 30 విడతల్లో చెల్లిస్తామని తెలిపింది. డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. కాగా ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పెండింగ్​ డీఏలను సైతం విడుదల చేయాలని కోరుతున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.