అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గోల్డ్ లవర్స్‌కు Gold Lovers గుడ్ న్యూస్ చెప్పాల్సిందే. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఊపిరి సలపనీయకుండా పెరుగుతూ వచ్చిన పసిడి ఇప్పుడు కొంత మెల్లగానే దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 24 సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, అది స్వల్పంగా తగ్గి ఇవాళ్టి ధర రూ.1,25,120గా నమోదైంది.
Today Gold Prices | క్రమంగా తగ్గుతున్న ధరలు..
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,660 ఉండగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,15,190కు లభిస్తోంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900గా ట్రేడ్ అయింది.
- ఇక ముంబైలో Mumbai 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,120గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,690గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,62,900గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,270, 22 క్యారెట్ల ధర రూ.1,14,840 కాగా, వెండి కిలో ధర రూ.1,62,900గా నమోదైంది.
- విజయవాడలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,25,840, 22 క్యారెట్ల ధర రూ.1,15,350 కాగా, వెండి కిలో ధర రూ.1,70,900.
- కేరళతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,25,120, 22 క్యారెట్ల ధర రూ.1,14,690గా కాగా, వెండి కిలో ధర రూ.1,70,900గా కొనసాగుతోంది.
మొత్తం మీద బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి కారణాల వల్ల రోజువారీగా మారుతూ ఉంటాయి.
బంగారం, వెండి తాజా ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ధరలు తర్వాత మారే అవకాశం లేకపోలేదు. ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యక్ష రేట్లను చెక్ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ Marriage season కావడంతో బంగారం కొనాలని అనుకున్నవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనడం మంచిది. రానున్న రోజులలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
