Homeజిల్లాలునిజామాబాద్​DCP Baswareddy | బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి

DCP Baswareddy | బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి

ఏ సమస్య వచ్చినా బాలికలు ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని డీసీపీ (అడ్మిన్​) బస్వారెడ్డి సూచించారు. ధర్మారం రెసిడెన్షియల్​ స్కూల్​లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: DCP Baswareddy | బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని అదనపు డీసీపీ(అడ్మిన్​) బస్వారెడ్డి సూచించారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశానుసారం ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్‌లో (Dharmaram Residential School) విద్యార్థినులకు లైంగిక వేధింపులు, హింస నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భరోసా సేవలు దినోత్సవ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.

బాలికలు నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని దానికనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పుష్పవతి, కోఆర్డినేటర్ రోజా, లీగల్ సపోర్ట్ పర్సన్ డయానా, సపోర్ట్​ పర్సన్ మౌనిక, షీ టీమ్స్ ఎస్సై స్రవంతి తదితరులు పాల్గొన్నారు.