Homeతాజావార్తలుGHMC | జీహెచ్​ఎంసీ మీటింగ్​లో రచ్చ రచ్చ..

GHMC | జీహెచ్​ఎంసీ మీటింగ్​లో రచ్చ రచ్చ..

జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు సైతం ఆందోళన చేపట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC | జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశంలో (GHMC council meeting) సభ్యుల ఆందోళనతో రచ్చ రచ్చ నెలకొంది. మేయర్​ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సమావేశం ప్రారంభం సందర్భంగా వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలు ఆలపించారు. ఆ సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో అలాగే కూర్చొని ఉన్నారు. దీనిపై బీజేపీ కార్పొరేటర్లు (BJP corporators) అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మజ్లిస్​ కార్పొరేటర్లు సైతం ఆందోళనకు దిగారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

GHMC | టేబుళ్ల మీదకు ఎక్కి..

మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల సభ్యులు టేబుళ్ల మీదకు ఎక్కి హంగామా చేశారు. దీంతో మార్షల్స్​ వచ్చి వారిని సభ నుంచి బయటకు పంపేందుకు యత్నించారు. సభ జరిగేలా సహకరించాలని మేయర్​తో పాటు కాంగ్రెస్​ సభ్యులు కోరారు.

GHMC | బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల ఆందోళన

సభలో బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు (BRS corporators) సైతం ఆందోళన చేపట్టారు. సమావేశం ప్రారంభానికి ముందు బీఆర్​ఎస్​ సభ్యులు ప్లకార్డులతో హాల్​లోకి వచ్చారు. దీంతో మార్షల్స్​ వచ్చి వారి వద్ద ఉన్న ప్లకార్డులను లాక్కెళ్లారు. దీనిపై బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్​లో ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభం కాకముందే మార్షల్స్​ హాల్​లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.

అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన తెలిపారు. వారు సమావేశానికి దున్నపోతులతో నిరసనగా వచ్చారు. సీఎం, జీహెచ్ఎంసీ మేయర్‌, అధికారులకి వినతిపత్రం ఇవ్వడం కన్నా.. దున్నపోతుకి ఇవ్వడం మేలంటూ నినాదాలు చేశారు. కాగా జీహెచ్​ఎంసీ పాలకవర్గ పదవి కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ కౌన్సిల్ సమావేశం చివరిది. ఆఖరు మీటింగ్​లో కూడా సభ్యులు రచ్చ రచ్చ చేయడం గమనార్హం.