అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC Council Meeting | జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేడు (మంగళవారం) జరగనుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ పాలకవర్గానికి ఇదే చివరి సమావేశం కానుంది. దీంతో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుంది. 45 ఎజెండా అంశాలు, 95 ప్రశ్నలపై చర్చించనున్నారు. కార్పొరేటర్లతో పాటు నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీటింగ్కు హాజరు కానున్నారు. చివరి కౌన్సిల్ మీటింగ్ (Council Meeting) కావడంతో గత ఐదేళ్లలో చేపట్టిన పనుల గురించి చర్చించే అవకాశం ఉంది. కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో కార్పొరేటర్లు ఆయా పార్టీల పెద్దలతో భేటీ అయ్యారు. నగరంలోని ప్రజా సమస్యలపై చర్చించాలని విపక్ష నాయకులు కార్పొరేటర్లకు సూచించారు. భూముల అమ్మకంపై నిలదీయాలని కేటీఆర్ అన్నారు.
GHMC Council Meeting | బీఆర్ఎస్ నిరసన
నగరంలోని విలువైన భూములను ఇటీవల ప్రభుత్వం వేలం వేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నిలదీసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators) సిద్ధం అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు నిరసన చేపట్టనున్నారు. నగరంలోని ప్రజా సమస్యలపై నిలదీసేందుకు బీజీపీ సిద్ధం అవుతోంది. సమావేశం నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ కార్యాలయం (GHMC Office) వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
