Homeజిల్లాలుకామారెడ్డిYellareddy MLA | భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

Yellareddy MLA | భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

సంతాయిపేట భీమేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు కోరారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందించారు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy MLA | తాడ్వాయి మండలం (Tadwai Mandal)లోని సంతాయిపేటలో గల భీమేశ్వర ఆలయం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు (MLA Madan Mohan Rao) కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి (IAS) ని కలిశారు.

భీమేశ్వర స్వామి ఆలయ (Bhimeshwara Swamy Temple) అభివృద్ధి కోసం మౌలిక వసతుల పనులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడ్వాయి–సంతాయిపేట్ రహదారి నుంచి ఆలయానికి వెళ్లే అప్రోచ్ రోడ్డును బాగు చేయాలన్నారు. పర్యాటక వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు,భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధికి TGTDC MD వల్లూరు క్రాంతి సానుకూలంగా స్పందించారు.