Homeజిల్లాలునిజామాబాద్​Armoor | ఆర్మూర్​లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

Armoor | ఆర్మూర్​లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

ఆర్మూర్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి ప్రారంభించారు. పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

అక్షరటుడే,ఆర్మూర్: Armoor | ఆర్మూర్ నియోజకవర్గంలో(Armur Constituency) పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​ రెడ్డి (MLa Sudharshan Reddy) ప్రారంభించారు. జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డితో (Armur Constituency) కలిసి ఆదివారం పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్ ​(PCC Chief Mahesh Kumar) గౌడ్​, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి (Mla Rakesh Reddy) కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Armoor | ఆంధ్రనగర్​ నుంచి ఇందిరానగర్​ వరకు..

ఆంధ్రనగర్ నుండి ఇందిరానగర్ మీదుగా లక్నాపూర్ వరకు రూ. 2.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నందిపేట్ శివారులో జన్నేపల్లి మెయిన్ రోడ్డు నుండి లక్కంపల్లి, చింరాజ్ పల్లి మీదుగా తల్వేద వరకు రూ.6.93 కోట్లతో చేపట్టనున్న ఆర్​అండ్​బీ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.

ఐలాపూర్ గ్రామంలో రూ.2.45 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.