అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagdeep Dhankhar | మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Former Vice President Jagdeep Dhankhar) సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS) ఆయన అడ్మిట్ అయ్యారు.
ధన్‌ఖడ్ శనివారం వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రెండుసార్లు స్పృహ కోల్పోయారని ఓ అధికారి తెలిపారు. దీంతో పరీక్షల కోసం ఎయిమ్స్‌కు వెళ్లగా.. వైద్యులు ఆస్పత్రిలో చేరాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ (MRI scan) చేయనున్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రజా కార్యక్రమాలకు హాజరైనప్పుడు సైతం ఆయన పలుమార్లు స్పృహ కోల్పోయారు. కాగా అనారోగ్య కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
🚨Jagdeep Dhankhar, a former Vice President of India, was admitted to the All India Institute of Medical Sciences (AIIMS) in New Delhi after he lost consciousness twice over the weekend, officials said.
According to news agency, the 74-year-old experienced health issues on… pic.twitter.com/oXnQGbNrHN
— Hindustan Times (@htTweets) January 12, 2026
Jagdeep Dhankhar | రాజీనామాపై అనేక చర్చలు
గత ఏడాది జూలైలో ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై అనేక ఊహగనాలు వచ్చాయి. కాగా ధన్‌ఖడ్ ఆగస్టు 2022లో పదవీ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఆగస్టు 2027 వరకు ఉంది. అయినా కూడా అనారోగ్య కారాణాలతో రాజీనామా చేశారు. ఆయనకు ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో యాంజియోప్లాస్టీ జరిగింది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యంగా కనిపించడం లేదు. అయితే రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రం చాలా ఉత్సాహంగా పని చేశారు.