అక్షరటుడే,గాంధారి: Panchayat Elections | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండల (Gandhari mandal) కేంద్ర సర్పంచ్ ఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ తన సతీమణి రేణుకను సర్పంచ్ (Sarpanch) అభ్యర్థిగా బరిలో నిలిపారు.
Panchayat Elections | వాయిస్ కాల్స్ కలకం రేపినప్పటికీ..
అయితే మాజీ సర్పంచ్ అవినీతికి పాల్పడ్డాడని పేర్కొంటూ వాయిస్ కాల్స్ సైతం పంపించారు. మళ్లీ ఆయన సతీమణ గెలిస్తే ఆమె అండతో అవినీతి జరుగుతుందని కాల్స్‌లో పేర్కొన్నారు. గాంధారిలో ఈ కాల్స్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశాన్ని ‘అక్షరటుడే’ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనతో మాజీ సర్పంచ్‌పై ఓటర్లకు మరింత సానుభూతి పెరిగిందని తెలుస్తోంది.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థి రేణుక ముందంజలో నిలిచారు. ఆమె తన సమీప అభ్యర్థిపై ఆకుల కల్పన చంద్రశేఖర్‌కు 1,538 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి అయిన మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ కు 3,653 ఓట్లు వచ్చాయి. దీంతో రెండువేల పైచిలుకు తేడాతో ఆమె భారీ విజయం సాధించారు.