Homeజిల్లాలుమెదక్​Konda Lakshma Reddy | చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మృతి

Konda Lakshma Reddy | చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మృతి

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై సీఎం రేవంత్​రెడ్డి, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Konda Lakshma Reddy | కాంగ్రెస్​ నేత, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (Konda Lakshma Reddy)(84) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు అయిన లక్ష్మారెడ్డి కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని హైదర్​గూడ ఆస్పత్రికి (Hyderguda Hospital) తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 5:30 గంటలకు తుది శ్వాస విడిచారు.

Konda Lakshma Reddy | కేవీ రంగారెడ్డి మనవడు

కొండా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) డిప్యూటీ సీఎంగా పని చేసిన కొండా వెంకట రంగారెడ్డి మనమడు. లక్ష్మారెడ్డి చాలాకాలంగా కాంగ్రెస్​తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ ప్రతినిధి, ఛైర్మన్‌తో సహా కీలక పదవులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1983 నుంచి 85 వరకు చేవెళ్ల ఎమ్మెల్యేగా పని చేశారు. 1999, 2014లో హైదరాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

Konda Lakshma Reddy | జర్నలిజంపై ఆసక్తి

కొండా లక్ష్మారెడ్డికి జర్నలిజంపై ఆసక్తి ఉండేది. దీంతో ఆయన 1980లో ఆయన స్థానిక వార్త సంస్థ NSS ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంతో మంది జర్నలిస్ట్​లుగా ఎదిగారు. ఆయన నాయకత్వంలో, NSS వందలాది మంది యువ జర్నలిస్టులకు శిక్షణా స్థలంగా ఉపాధి వనరుగా మారింది. లక్ష్మారెడ్డి జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ (Hyderabad Press Club) అధ్యక్షుడిగా సైతం పనిచేశారు.

Konda Lakshma Reddy | సీఎం సంతాపం

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) కార్యదర్శి నరేందర్ రెడ్డి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు సంతాపం తెలిపారు.