అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad)లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి (Erragadda Mental Hospital)లో మంగళవారం పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్తో 30 మంది రోగులు అనారోగ్యం బారిన పడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కరణ్ అనే రోగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అస్వస్థతకు గల కారణాలపై ఆరాతీసింది. ఆస్పత్రి అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
