అక్షరటుడే, కోటగిరి: Food Festival | పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఇన్ఛార్జీలు షబానా బేగం (food in-charges Shabana Begum), మాధవి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్‌ను హెచ్ఎం సాయిలు ప్రారంభించారు.
పాఠశాలలోని విద్యార్థులు దాదాపు 50 రకాల వంటలను తయారు చేసుకోని వచ్చారు. అధికారులు ఉపాధ్యాయులు వివిధరకాల వంటకాలను రుచిచూసి అభినందించారు. హరియాణా వంటకాలు (Haryana dishes), పూరీ కీర్, బజ్జ రోటీ, చుర్మా, జొన్నరొట్టె, శకినాలు, పలు రకాల వంటకాలు చేశారు. విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని హెచ్ఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ వంటకాలు చేసిన విద్యార్థులను విజేతలుగా నిర్ణయించి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదవ్, ఉపాధ్యాయులు నాగనాథ్, రామారావు, చందర్, నిర్మల, లత, వనజ, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
