Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | గొర్లకాపరి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

Kamareddy | గొర్లకాపరి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

గొర్లను కాపాడే క్రమంలో నీటిలో పడి దేవునిపల్లి గ్రామానికి చెందిన దర్శపు సుధాకర్ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని మంగళవారం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గొర్లను కాపాడే క్రమంలో దేవునిపల్లి గ్రామానికి (Devunipalli village) చెందిన దర్శపు సుధాకర్ ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని మంగళవారం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.

అతడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తనవంతుగా రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. సుధాకర్ పిల్లలు చదువుకోడానికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మామిళ్ల అంజయ్య, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, వీరన్న పటేల్, మాజీ కౌన్సిలర్లు ఊర్దొండ రవి, చాట్ల వంశీ, పంపరి శ్రీనివాస్, పిడుగు మమత సాయిబాబా, శంకర్ రావు, గడ్డమీది మహేష్, మామిల్ల రమేష్, రంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.