120
అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | మున్సిపల్ ఎన్నికల (municipal elections) నేపథ్యంలో బోధన్ పట్టణంలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ (Municipal Commissioner Jadhav Krishna) ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాను మున్సిపాలిటీలో సోమవారం విడుదల చేశారు.
Bodhan Municipality | 38వార్డులకు గాను..
బోధన్ మున్సిపాలిటీలో (Bodhan municipality) 38 వార్డులకు గాను 69,426 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 35,728 మహిళా ఓటర్లు 33,697 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. అయితే గతంలో విడుదల చేసిన ముసాయిదా జాబితాపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఓటర్లు వార్డులు దాటిపోయాయి. వీటిపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరాలు సైతం తెలిపారు. మరి ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాను సవరించారా లేదా తెలియాల్సి ఉంది.