Actress Meena | బీజేపీలోకి సినీ నటి మీనా!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే(AIADMK) పార్టీతో పొత్తు పెట్టుకుంది. అంతేగాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలు సైతం అన్నామలై నుంచి నైనార్​ నాగేంద్రన్​కు అప్పగించింది. తమిళనాడు 2026 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటిలోగా పార్టీని బలోపేతం చేసి, వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా కాషాయదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోగా.. పలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : actress Meena | తమిళనాడు (Tamil Nadu)లో ఎలాగైనా బలపడాలని బీజేపీ (BJP) భావిస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే(AIADMK) పార్టీతో పొత్తు పెట్టుకుంది.

అంతేగాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలు సైతం అన్నామలై నుంచి నైనార్​ నాగేంద్రన్​కు అప్పగించింది. తమిళనాడు 2026 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పటిలోగా పార్టీని బలోపేతం చేసి, వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా కాషాయదళం పావులు కదుపుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోగా.. పలు చిన్న పార్టీలతో కూడా జత కడుతోంది.

Actress Meena | ప్రముఖులను టార్గెట్ చేసి..

పలువురు సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బలపడాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నటీ మీనా (Meena) తమిళనాడు బీజేపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్ (Vice President Dhankhar)​ను కలిశారు. పార్టీలో చేరికపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా.. తమిళనాట ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఖుష్బూ, నమిత, శరత్‌కుమార్‌ వంటి సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకుంది. తాజాగా మీనాను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోంది. ఆమె పార్టీలో చేరగానే కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

తమిళనాడులో ఎలాగైనా పాగ వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పటికే ఎన్​డీఏ భాగస్వామి అయినా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ (Pavan Kalyan)​ను రంగంలోకి దింపింది. ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్​ భక్తుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరి బీజేపీ ప్రణాళికలు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాలి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.