Police Prajavani | బాధితులు పోలీస్ ​ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు: సీసీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Police Prajavani | బాధితులు నిర్భయంగా పోలీస్ ​ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 35 ఫిర్యాదులు స్వీకరించారు. Police Prajavani | వివిధ ప్రాంతాల నుంచి.. ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో (CP Office) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Police Prajavani | బాధితులు నిర్భయంగా పోలీస్ ​ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో 35 ఫిర్యాదులు స్వీకరించారు.

Police Prajavani | వివిధ ప్రాంతాల నుంచి..

ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో (CP Office) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సీపీ బాధితులతో స్వయంగా మాట్లాడారు. బాధితుల నుంచి వారి సమస్యలు తెలుసుకుని చట్టపరంగా తీసుకునే చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్​స్టేషన్ల సీఐ, ఎస్సైలకు సమాచారం అందించారు.

Police Prajavani | మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా..

సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా సీపీ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. మూడోవ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ (District Police Department) పని చేస్తుందని సీపీ తెలిపారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.