Homeజిల్లాలునిజామాబాద్​Mendora | వెల్గటూర్‌లో కరెంట్ షాక్‌తో రైతు మృతి

Mendora | వెల్గటూర్‌లో కరెంట్ షాక్‌తో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలం వెల్గటూర్​లో సోమవారం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా: Mendora | విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా మండలం (Mendora mandal) వెల్గటూర్​లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్​ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (59) ఉదయం పొలంలోని మోటార్ స్టార్ట్ చేయబోగా కరెంట్ షాక్ (electric shock) తగిలి మృతి చెందాడు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని మస్తాన్ కుమారుడు షేక్ సలీం ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.