Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | ఫేక్ కరెన్సీ ముఠా సభ్యుల అరెస్ట్

Kamareddy SP | ఫేక్ కరెన్సీ ముఠా సభ్యుల అరెస్ట్

కామారెడ్డి పోలీసులు ఫేక్​ కరెన్సీ కేసు దర్యాప్తులో దూకుడు పెంచారు. తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | ఫేక్​ కరెన్సీ నోట్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరికొందరిని అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్​ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.

అంతర్రాష్ట్ర ఫేక్​ కరెన్సీ నోట్ల తయారీ కేసులో పోలీసులు గతంతో ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రలో గాలింపు చేపట్టిన 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్నీపై ఇటీవల పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. ముఠాలోని మరొక ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఛత్తీస్​గఢ్​లో ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేశ్​ చంద్ర తెలిపారు. వీరి నుంచి రూ.1.70 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.