Homeతాజావార్తలుKavitha Janam Bata | రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు : కల్వకుంట్ల కవిత

Kavitha Janam Bata | రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు : కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. అత్తాపూర్​లోని భూపాల్​ నగర్​, మియాపూర్​లోని పీఏ నగర్ బస్తీలను సందర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Janam Bata | రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు సాగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఫార్ముల ఈ–కారు రేసు కేసులో కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు గవర్నర్​ అనుమతించడంపై ఆమె స్పందించారు.

కవిత జనంబాట (Kavitha Janam Bata) కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ముందుగా కూకట్​పల్లిలో ” SAY NO TO DRUGS ” క్యాంపెయిన్​లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మియాపూర్​లోని పీఏ నగర్ బస్తీ, రాజేంద్రనగర్​ నియోజకవర్గం (Rajendranagar Constituency) అత్తాపూర్​లోని భూపాల్​నగర్​లోసందర్శించారు. బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

Kavitha Janam Bata | ప్రతిపక్ష నేతలపై కేసులు

వాళ్ల మీద, వీళ్ల మీద కేసులు పెట్టడమే బీజేపీ పని అని కవిత అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం సైతం ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతోందని విమర్శించారు. కేటీఆర్ (KTR)​పై విచారణకు గవర్నర్​ అనుమతించడంపై ఆమె స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ప్రజల్లో ముఖం చూపట్టలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతోందని విమర్శించారు. దేశంలో కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని చెప్పారు.

Kavitha Janam Bata | ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

కవిత (Kalvakuntla Kavitha) రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని అత్తాపూర్​ డివిజన్​లోని భూపాల్​నగర్​లో పర్యటించారు. కాలనీలో 45 ఏళ్లుగా పేదలు నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే వారికి ఇప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. ప్రజలు ఇళ్ల పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం పోరాటం చేయడానికి తాము వచ్చామన్నారు. 20 ఎకరాల్లో పేదలు కబ్జాలో ఉన్నారని చెప్పారు. వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 20 ఎకరాల్లో 45 ఏళ్ల నుంచి 2 వేల కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అటవీశాఖకు రెండు రెట్ల భూమి ఇస్తే.. వీరికి పట్టాలు వస్తాయన్నారు.

Kavitha Janam Bata | లాకప్​ డెత్​పై విచారణ చేపట్టాలి

సూర్యాపేటలో కస్టడియోల్​ డెత్ జరిగిందని కవిత ఆరోపించారు. పోలీసులు ఓ దళిత యువకుడిని కొట్టి చంపారన్నారు. అంతేగాకుండా బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.