అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DMHO Rajashri | ప్రతి రోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీ (DMHO Rajashri) పేర్కొన్నారు. జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్వైజర్లు, ఇతర వైద్య సిబ్బందితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పీహెచ్సీలో రోగుల వివరాలు ఆన్లైన్లో (patient details online) నమోదు చేయాలన్నారు. అలాగే ఫార్మసీలో మందుల వివరాలను సైతం ఏరోజుకారోజు ఎంట్రీ చేయాలని సూచించారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. గర్భిణుల ఆరోగ్య పరీక్షల నమోదులో అలసత్వం వహించే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలపై (ANMs and ASHA workers) చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఆశ కార్యకర్త తమ పరిధిలో అర్హులైన మహిళలకు అనారోగ్య సమస్యలుంటే వెంటనే పీహెచ్సీకి వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలను పకడ్బందీగా నిర్వహిస్తూ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి శ్వేత, డీఎంవో డాక్టర్ వెంకటేష్, డీఎస్వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.