అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Canteen | హైదరాబాద్ నగరంలో పేదల కోసం ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి (Baglingampally) సుందరయ్య పార్క్ వద్ద క్యాంటీన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఇందిరమ్మ క్యాంటీన్ల (Indiramma Canteens) ద్వారా రూ.5కే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో బతుకు దెరువు కోసం ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని వస్తారని మంత్రి తెలిపారు. పనులకు వెళ్లే వారికి వీలుగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు కోసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ఇంకా ఎక్కడైనా క్యాంటిన్లు కావాలంటే తమ దృష్టికి తీసుకు రావలని సూచించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేదలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు.హైదరాబాద్‌కు ఉపాధి, విద్య, ఉద్యోగ అవసరాల కోసం వచ్చే కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించడం లక్ష్యంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) తదితరులు పాల్గొన్నారు.
Indiramma Canteen | పూలేకు నివాళి
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం (Minister Ponnam Prabhakar) నివాళులు అర్పించారు.పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ పాల్గొన్నారు.