అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | ‘‘యూఎస్‌కు భారత్ కంటే ఏ దేశమూ ముఖ్యం కాదని, వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో న్యూఢల్లీి, వాషింగ్టన్ చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. పాక్స్ నిలికా కూటమిలో భారత్ సభ్యురాలిగా ఉంటుంది. ఈ దేశాల సమూహంలో పూర్తి సభ్యుడిగా చేరడానికి భారత్‌ను ఆహ్వానించనున్నాం’’ అంటూ భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్‌కు (Stock Markets) బలాన్నిచ్చాయి.
దీంతో అప్పటివరకు వరుస సెషన్‌లలో భారీ నష్టాలతో కుదేలవుతున్న మార్కెట్.. ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకుని లాభాలబాట పట్టింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 182 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 756 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 31 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 227 పాయింట్లు నష్టపోయింది. అయితే భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు చిగురించడంతో మధ్యాహ్నం తర్వాత బుల్ రంకెలు వేయడం ప్రారంభించింది. దీంతో ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,101 పాయింట్లు, నిఫ్టీ 340 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ (Sensex) 301 పాయింట్ల లాభంతో 83,878 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | స్మాల్ క్యాప్‌లో భారీగా అమ్మకాలు..
బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 1.92 శాతం, కమోడిటీ ఇండెక్స్ 1.06 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.85 శాతం, పీఎస్‌యూ 0.83 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.63 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.58 శాతం లాభపడ్డాయి. రియాలిటీ ఇండెక్స్ 1.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.82 శాతం, ఇండస్ట్రియల్ 0.67 శాతం, హెల్త్‌కేర్ 0.51 శాతం, టెలికాం 0.46 శాతం, పవర్ 0.36 శాతం నష్టపోయాయి లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,569 కంపెనీలు లాభపడగా 2,724 స్టాక్స్ నష్టపోయాయి. 192 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 82 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 532 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభపడగా.. 5 కంపెనీలు నష్టపోయాయి. టాటా స్టీల్ 2.75 శాతం, ఆసియన్ పెయింట్ 2.54 శాతం, ట్రెంట్ 2.055 శాతం, ఎస్‌బీఐ 1.51 శాతం, హెచ్‌యూఎల్ 1.32 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Losers..
ఇన్ఫోసిస్ 1.16 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.93 శాతం, బీఈఎల్ 0.29 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.22 శాతం, ఎల్‌టీ 0.20 శాతం నష్టపోయాయి.