అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Elon Musk | ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘X చాట్’ ను అధికారికంగా ప్రారంభించారు.
మస్క్ (Elon Musk) సొంత కంపెనీ xAI అభివృద్ధి చేసిన ఈ కొత్త సర్వీస్‌ను ప్రత్యేకంగా WhatsApp, Arattai, Telegram వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లకు టఫ్ కంపిటీషన్‌గా తీసుకొచ్చారు. ఈ యాప్ పూర్తిగా గోప్యతని పాటిస్తుందని, Xలో మెసేజింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, వేగంగా, సింపుల్‌గా మార్చడానికి అనేక ప్రత్యేక ఫీచర్లు జోడించామని మస్క్ ప్రకటించారు.
Elon Musk | ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ — గ్రూప్ చాట్‌లు, మీడియాకు కూడా సెక్యూరిటీ
X చాట్ (X Chat)లో పంపే ప్రతి సందేశం టెక్స్ట్, ఫోటో, వీడియో, ఫైల్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడ్డాయి. ఇకపై:
- గ్రూప్ చాట్‌లు కూడా ఎన్‌క్రిప్ట్
- మీడియా ఫైళ్లకు కూడా పూర్తి రక్షణ
- పంపేవారు/స్వీకర్త మాత్రమే సందేశాన్ని చూడగలరు
అరట్టై Arattai వంటి కొన్ని యాప్‌లలో ఇంకా ఈ లెవల్‌లో ఎన్‌క్రిప్షన్ అందుబాటులో లేదు.
Elon Musk | హై ప్రైవసీ కోసం:
పంపిన మెసేజ్‌ను ఎడిట్/డిలీట్ చేయొచ్చు
WhatsApp లా ‘This message was deleted’ మెసేజ్ కనిపించదు , మెసేజ్ పూర్తిగా చెరిగిపోతుంది
- ఆటో-డిలీట్ టైమర్ సెట్ చేసే సౌకర్యం
- స్క్రీన్‌షాట్ బ్లాక్ + అలర్ట్ నోటిఫికేషన్
- గోప్యతను పెంచేందుకు X చాట్‌లో:
- స్క్రీన్‌షాట్ తీసే ప్రయత్నాన్ని బ్లాక్ చేయవచ్చు
- ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసేందుకు ప్రయత్నిస్తే, మీకు నోటిఫికేషన్ వస్తుంది
- ఇది ప్రైవసీపై కేర్ చేసే యూజర్లకు అత్యంత పెద్ద ప్రయోజనంగా మారింది.
- యాడ్స్ లేవు, ట్రాకింగ్ లేదు
X చాట్‌లో:
- ఎలాంటి ప్రకటనలు ఉండవు
- డేటా ట్రాకింగ్ లేదు
- పాత DMs + కొత్త చాట్స్‌కి ఒకే యూనిఫైడ్ ఇన్‌బాక్స్
మస్క్ లక్ష్యం .. Xలోని ప్రతి ఫీచర్‌ను ఒక ప్రత్యేక యాప్‌లా పనిచేసేలా మార్చడం. అదే ప్రయత్నంలో భాగంగా త్వరలో X Money కూడా లాంచ్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఆడియో/వీడియో కాల్స్, ఫైల్ ట్రాన్స్‌ఫర్, వాయిస్ మెమోలు
X చాట్ పూర్తిస్థాయి కమ్యూనికేషన్ స్టాక్‌గా రూపొందించబడింది. ఇందులో త్వరలో:
- ఆడియో కాల్స్
- వీడియో కాల్స్
- హై-స్పీడ్ ఫైల్ ట్రాన్స్‌ఫర్
- వాయిస్ మెమోలు
అన్నీ అందుబాటులోకి రానున్నాయి.
ఎక్కడ అందుబాటులో ఉంది?
ప్రస్తుతం:
- iOS
- వెబ్ (X DM విభాగం)
లో అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ Android వెర్షన్ చాలా త్వరలో విడుదల కానుందని కంపెనీ ప్రకటించింది.
Elon Musk | WhatsAppకు మస్క్ పెద్ద సవాలా?
పూర్తిగా ప్రైవసీ-కేంద్రీకృతం, యాడ్‌ఫ్రీ, అతి వేగవంతమైన చాట్ అనుభవంతో X చాట్ మెసేజింగ్ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించే అవకాశం ఉంది. మస్క్ విజన్ ప్రకారం ఇది ఒక కొత్త మెసేజింగ్ యుగానికి ప్రారంభం కావచ్చని నిపుణులు అంటున్నారు.
