12
అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | గ్రామపంచాయతీ ఎన్నికలకు (Gram Panchayat elections) జిల్లా అబ్జర్వర్‌గా నియమితులైన వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి శ్యాం ప్రసాద్ లాల్ గురువారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) భేటీ అయ్యారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఎన్నికలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్‌కు ఫిర్యాదులు, సూచనలు చేయదలచిన వారు 6309505554 నంబరును సంప్రదించాలన్నారు. అలాగే observergpelec.nzb@gmail.com కు కూడా మెయిల్ చేయవచ్చని పరిశీలకులు శ్యాంప్రసాద్ తెలిపారు.
1 comment
[…] (Nizamabad) నగరంలో గోల్ హనుమాన్ నుండి […]
Comments are closed.