అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ప్రతిమండలంలో మత్స్య మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో వందశాతం రాయితీతో చేపల పిల్లలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో వెయ్యి గజాలు ప్రభుత్వ స్థలాన్ని చేపల మార్కెట్ కోసం కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. తద్వారా చేపల అమ్మకం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy Mandal) మార్కెట్ యార్డు ప్రారంభమైందన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. లింగంపేట్ మండలంలో కూడా చేపల మార్కెట్ యార్డు కోసం భూమిని గుర్తించినట్లు చెప్పారు. అన్ని మండల ప్రధాన కేంద్రాల్లో ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
