అక్షరటుడే, ఎల్లారెడ్డి : Ramareddy | రామారెడ్డి మండల కేంద్రంలోని కాలభైరవస్వామి ఆలయాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు (MLA Madan Mohan Rao) పేర్కొన్నారు.
కాలభైరవస్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఇస్సానపల్లి, రామారెడ్డి (Ramareddy) వీధుల్లో నిర్వహించిన రథయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాల భైరవస్వామి ఆలయం (Kala Bhairava Swamy Temple) అత్యంత పవిత్రమైందన్నారు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకుంటారన్నారు.
Ramareddy | తాను స్వయంగా రామారెడ్డి వాడినే..
తాను రామారెడ్డివాడినేని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నా చిన్ననాటి జ్ఞాపకాలు అంతా కాలభైరవస్వామి ఆలయంతో ముడిపడి ఉన్నాయని.. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్నప్పటి నుంచి స్వామివారి ఉత్సవాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ పెరిగానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
