Homeజిల్లాలునిజామాబాద్​Armoor MLA | గంగపుత్రుల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి

Armoor MLA | గంగపుత్రుల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి

గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ గుండ్ల చెరువులో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను చేరువలో వదిలారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor MLA | గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ గుండ్ల చెరువులో (Armoor Gundla tank) 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను చేరువలో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గంగపుత్రులకు గతంలోనూ వాహనాలు పంపిణీ చేశామన్నారు.

చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాలని సూచించారు. చెరువులు గంగపుత్రులకే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతాయన్నారు. చెరువులో కలుషిత నీరు కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, వేణు, కలిగోట్ గంగాధర్, భరత్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.