అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IBomma Ravi | టాలీవుడ్‌తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినిమాలను పైరసీ చేసి తన ఐబొమ్మ వెబ్సైట్లో పెడుతున్న ఇమ్మడి రవి (Immadi Ravi)ని ఇటీవల హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసులోకి ఈడీ (ED) ఎంట్రీ ఇచ్చింది.
వేలాది సినిమాలను పైరసీ చేయడంతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం, ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడం వంటి నేరాలకు పాల్పడిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు అందినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు తాజాగా రంగంలో దిగారు. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీ (Hyderabad CP)కి లేఖ రాశారు. ఐబొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడు రవి ఖాతాల నుంచి రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు సమాచారం. నెలకు రూ.15 లక్షలు క్రిప్టో వ్యాలెట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు తెలిసింది. వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది.
IBomma Ravi | రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విసయాలు వెల్లడించారు. ఐబొమ్మ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. రవి విచారణలో నేరం అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు తెలిపాడు. ఐబొమ్మ రవిని పట్టుకోవడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సాయం పొందారు.
IBomma Ravi | విచారణ వాయిదా
ఇమ్మడి రవిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టు (Nampalli Court)లో పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్‌పై విచారణను జడ్జి రేపటికి వాయిదా వేశారు.
