అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake | బంగ్లాదేశ్‌లో (Bangladesh) శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. నర్సింగ్డి సమీపంలో 5.6 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. దీంతో ఢాకా (Dhaka), బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు వచ్చాయి.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:08 గంటలకు భూకంపం వచ్చింది. 10:40 గంటల ప్రాంతంలో ఢాకాలో ప్రకంపనలు వచ్చాయి. భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి తూర్పు-ఆగ్నేయంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) (NCS) తెలిపింది.
భూకంపం సమయంలో కోల్‌కతా (Kolkata), పరిసర ప్రాంతాల్లో స్వల్ప కంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఫ్యాన్లు వాల్ హ్యాంగింగ్‌లు ఊగాయని స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దక్షిణ్ మరియు ఉత్తర దినాజ్‌పూర్ మరియు కూచ్ బెహార్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలైన మేఘాలయ (Meghalaya), త్రిపుర, మిజోరంతో సహా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే భూకంపంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించినట్లు ఆధారాలు లేవు.
Earthquake | పాకిస్థాన్‌లో భూకంపం
పాకిస్థాన్‌లో (Pakistan) సైతం గురువారం భూకంపం వచ్చింది. 3.9 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీల మండలాల్లో ఒకటిగా ఉన్నాయి. ఇక్కడ భారత మరియు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్రాంతంలో తరచుగా మధ్యస్థం నుంచి బలమైన భూకంపాలు సంభవిస్తాయి.
