HomeసినిమాDude Movie Review | ‘డ్యూడ్’ మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ వన్ మాన్ షో.....

Dude Movie Review | ‘డ్యూడ్’ మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ వన్ మాన్ షో.. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరీ!

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం ‘డ్యూడ్’ రిలీజ్​ అయింది. ఈ డబ్బింగ్​ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dude Movie Review | ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం ‘డ్యూడ్’.

ఇందులో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం (Director Keerthyshwaran) వహించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? చూద్దాం.

Dude Movie Review | కథ..

పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు) తన మేనత్త కుమారుడు గగన్​ని (ప్రదీప్ రంగనాథన్)  ప్రేమిస్తుంది. కానీ గగన్ ఆ ప్రేమను తిరస్కరిస్తాడు. బాధతో బెంగళూరుకు వెళ్లిపోతుంది కుందన. అయితే ఆమె దూరమైన తర్వాత గగన్ తనకు నిజంగా ప్రేమ కలిగిందని గ్రహిస్తాడు. కుందనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలో వారిద్దరి పెళ్లికి అడ్డుగా వచ్చిన సమస్య ఏమిటి? కుందన ‘పెళ్లి వద్దు’ అని ఎందుకంది? గగన్ తల్లి (రోహిణి) మరియు కుందన తండ్రి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి? అన్నది మిగతా కథ.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్..

ప్రేమకథల్లో కొత్తదనం చూపడం కష్టం అయినా ‘డ్యూడ్’లో (Dude Movie) కథ చెప్పిన తీరు, హీరో ప్రదీప్ రంగనాథన్ (Hero Pradeep Ranganathan) నటన సినిమాకు కొత్త ఫీలింగ్ తీసుకువచ్చాయి. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, హీరో నటన, సాయి అభ్యంకర్ సంగీతం సినిమాను లిఫ్ట్ చేశాయి. ప్రదీప్ రంగనాథన్ సినిమా మొత్తాన్ని భుజాల మీద మోశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన నటన, ఎమోషనల్ సీన్స్‌లోని నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్ అద్భుతంగా వర్క్ అయ్యాయి. ఈ తరం యువకులు తమను తాము ఆయనలో చూసుకుంటారు. మమితా బైజు (Mamita Baiju) సహజంగా నటించింది. శరత్ కుమార్ పాత్రలో హాస్యాన్ని, సీరియస్‌నెస్‌ను సమతుల్యంగా చూపించారు. రోహిణి, హృదూ హరూన్, నేహా శెట్టి, సత్య తగిన స్థాయిలో నటించారు.

టెక్నికల్ విభాగం..

సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ కాగా, నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. దర్శకుడు కీర్తిశ్వరన్ కథలో కొత్తదనం లేకపోయినా, కథనం, క్యారెక్టర్ రైటింగ్, హాస్య సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎమోషన్ బాగానే పండాయి.

తారాగణం : ప్రదీప్, మమిత బైజు, శరత్ కుమార్, నేహా శెట్టి
దర్శకత్వం : కీర్తిశ్వ‌ర‌న్
బ్యానర్ : మైత్రి మూవీ మేక‌ర్స్
సంగీతం : సాయి అభ్యంక‌ర్
సినిమాటోగ్రఫి : నికేత్ బొమ్మి
ఎడిటింగ్ : భరత్ విక్రమన్

ప్ల‌స్ పాయింట్స్:

ప్రదీప్ రంగనాథన్ అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్
చక్కని సంగీతం
రిచ్ ప్రొడక్షన్ విలువలు
రిలేటబుల్ ఎమోషన్స్
ఫన్ మూమెంట్స్

మైన‌స్ పాయింట్స్:

కథలో కొత్తదనం లేకపోవడం
మధ్యలో స్లో పేస్

తీర్పు

‘డ్యూడ్’ సినిమా కథ పరంగా కొత్తది కాకపోయినా, ప్రదీప్ రంగనాథన్ నటన, సాయి అభ్యంకర్ సంగీతం, ఎమోషనల్ మూమెంట్స్ సినిమాను థియేటర్లలో ఆస్వాదించదగినదిగా చేశాయి. ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే ప్రేమకథగా నిలుస్తుంది. ఇప్ప‌టికే రెండు సినిమాల‌తో మంచి హిట్స్ కొట్టిన ప్ర‌దీప్ రంగ‌నాథన్ ఇప్పుడు ఈ చిత్రంతో కూడా మ‌రో మంచి మూవీని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రేటింగ్ : 3/5